
ప్రధానాంశాలు
కిసాన్ బ్రాండ్ పేరిట రామగుండం యూరియా
భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి
ఈనాడు డిజిటల్, మెదక్, కౌడిపల్లి, న్యూస్‌టుడే: వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించేలా కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధునిక పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేరుస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో సేంద్రియ సాగూ పెరిగిందన్నారు. శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో డా.రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం పరిపాలన భవనాన్ని, సేంద్రియ ఎరువుల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టంచేశారు. రూ.6 వేల కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రెండు నెలల్లో ప్రధాని మోదీ దాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. కిసాన్ బ్రాండ్ పేరిట ఇక్కడి నుంచి యూరియాను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏకే సింగ్‌లు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి, ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్ర కార్యదర్శి వినోద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50