
ప్రధానాంశాలు
సమస్యలు పరిష్కరించాలని భైఠాయింపు
మహబూబ్‌నగర్, వనపర్తి, ఈనాడు డిజిటల్: మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లకు సర్పంచుల ఆందోళన సెగ తాకింది. మహబూబ్‌నగర్‌లో శనివారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరు కాగా సర్పంచులు వారి సమస్యలను పరిష్కరించాలని వేదిక ముందు భైఠాయించడంతో గందరగోళానికి దారి తీసింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచులు శనివారం ‘చలో పాలమూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సర్పంచులు తొలుత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా సమ్మేళనం నిర్వహిస్తున్న మహబూబ్‌నగర్ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్ వద్దకు వచ్చి దారిపై బైఠాయించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఆందోళన విరమించాలని వారికి నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ఒక దశలో ఏం చేయాలో తోచక వేదికపై మంత్రులు మౌనంగా ఉండిపోయారు. సర్పంచుల సంక్షేమ సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్ వేదికపైకి వెళ్లి సర్పంచుల ఇబ్బందులు ఏకరవు పెట్టారు. సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తాననిఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50