
ప్రధానాంశాలు
గవర్నర్ తమిళిసై
కాణిపాకం, న్యూస్‌టుడే: కొవిడ్ టీకాపై ఎటువంటి అపోహలొద్దని, ప్రతి ఒక్కరూ విధిగా టీకాను వేయించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సూచించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి దర్శించుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ ఈవో ఎ.వెంకటేశు వారికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం గవర్నర్ విలేకరులతో మాట్లాడారు.
హస్తకళా ఉత్పత్తులపై తపాలా కవర్లు
తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన హస్తకళా ఉత్పత్తులైన చేర్యాల చిత్రాలు, నిర్మల్ బొమ్మలు, గద్వాల చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రిలపై తపాలా శాఖ రూపొందించిన నాలుగు కొత్త కవర్లను గవర్నర్ తమిళిసై శనివారం రాజ్‌భవన్‌లో విడుదల చేశారు. తపాలా శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఏకే పోద్దార్, చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్, పోస్ట్ మాస్టర్ జనరల్ విద్యాసాగర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
* నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి గవర్నర్ తమిళిసై పూలమాల వేసి నివాళులర్పించారు. నేతాజీ సిద్ధాంతాలను అందరూ పాటించాలని ఆమె సూచించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50