close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్రేటర్‌లో అమల్లోకి ప్రవర్తన నియమావళి

మేయర్‌ ఎన్నిక ముగిసే వరకు కొనసాగింపు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నగరంలో ఆదర్శ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) పార్థసారథి తెలిపారు. పరోక్ష ఎన్నికల సందర్భంగా నూతన ప్రజాప్రతినిధుల్ని మభ్యపెట్టే చట్టవ్యతిరేక చర్యల్ని అదుపులో పెట్టేందుకే ఈ నియమావళిని విధించినట్లు చెప్పారు. ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు ఇది అమల్లో ఉంటుందన్నారు. రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు పాటించాల్సిన నియమాల్ని శనివారం ఎస్‌ఈసీ వివరించారు. మేయర్‌, ఉపమేయర్‌ పదవులు ఆశిస్తున్నవారు ఏ రాజకీయ పార్టీలకు లంచం ఇవ్వడాన్ని ప్రోత్సహించవద్దని కోరారు. విప్‌లకు వ్యతిరేకంగా ఓటు వేయడం నిషేధమన్నారు. ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి ఎన్నికైన కార్పొరేటర్లతో ఎలాంటి శిబిరాలూ నిర్వహించొద్దని స్పష్టం చేశారు. ఎన్నిక నిర్వహణకు 48 గంటల ముందు నుంచి ఏ ప్రచార కార్యకలాపాల్ని సభ్యులు చేపట్టరాదని సూచించారు. నియమావళిలోని ఏ నిబంధన ఉల్లంఘించినా చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 11న నిర్వహించనున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై బల్దియా కసరత్తు ప్రారంభించింది. కొత్త సభ్యులతో ఆ రోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతిని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు