
ప్రధానాంశాలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్ష
ఈనాడు, హైదరాబాద్: దేశంలో ప్రతి పౌరుడికీ సమాన అవకాశాలు లభించాలని.. వివక్షకు తావులేని సంతోషకర, సుసంపన్నమైన నవభారత నిర్మాణం జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇందులో పాలుపంచుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పరాక్రమ దివస్’ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం.. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఉద్యోగులనుద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని చెప్పారు. కులవ్యవస్థ లేని భారతదేశాన్ని నేతాజీ ఆకాంక్షించారన్నారు. 1940లోనే అన్ని కులాలు, మతాలకు చెందిన సైనికులు సహపంక్తి భోజనాలు చేసే దిశగా ఆయన స్ఫూర్తిని రగిలించారన్నారు. భారతీయ సంప్రదాయాల్లో ఆరోగ్య విలువలు దాగి ఉన్నాయని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇటీవల కొవిడ్‌ను భారతదేశం సమర్థంగా ఎదుర్కొందన్నారు.
గ్రామీణ వాతావరణలో ఉండేవారు కరోనా ప్రభావానికి అతి తక్కువ లోనయ్యారన్న ఆయన.. చక్కటి గాలి, వెలుతురు ఉండే పరిసరాలే అందుకు కారణమని చెప్పారు. పట్టణాల్లోనూ ఈ తరహా సంస్కృతి పెరగాలని ఆకాంక్షించారు. ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హర్‌ప్రీత్‌సింగ్, అడిషినల్ డైరెక్టర్ జనరల్ బెన్హుర్ మహేష్‌దత్ ఎక్కా సహా అధ్యాపక సిబ్బంది, శిక్షణ పొందుతున్న అధికారులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!