close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రసూతి సేవలపై ప్రత్యేక శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసూతి సేవలు అందించడంలో మెళకువలు నేర్పేందుకు నర్సులకు 18 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యవిద్య సంచాలకుడు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుడు  విభాగాల పరిధిలో ప్రస్తుతం రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఫెర్నాండెజ్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ ‘నర్స్‌ ప్రాక్టీషనర్‌ మిడ్‌ వైఫరీ డిప్లొమా కోర్సు’ కోసం ఆదివారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అర్హులకు ఫిబ్రవరి 1న రాతపరీక్ష అనంతరం 4, 5 తేదీల్లో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు www.chfw.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు