close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకుని రండి

విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల ఎస్‌ఎంఎస్‌లు

ఈనాడు, వరంగల్‌: రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటోతేదీ నుంచి ప్రభుత్వం కళాశాలలు ప్రారంభించేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో కొన్ని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. కాలేజీలకు వచ్చే విద్యార్థులు కచ్చితంగా కొవిడ్‌ పరీక్ష చేసుకోవాలని ఆ నివేదికను ఒకరోజు ముందు తమకు అందజేయాలని సెల్‌ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నాయి. ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో కరోనా పరీక్ష చేయాలన్న నిబంధన లేదు. కేవలం విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి సమ్మతిపత్రం తెస్తే చాలు. ప్రభుత్వ కళాశాలల్లో థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కానీ శనివారం హన్మకొండలోని ఓ కళాశాల కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏముందని వారు వాపోయారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు