close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అఫ్జల్‌సాగర్‌ నర్సుకు నైటింగేల్‌ పురస్కారం

కార్వాన్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలోని అఫ్జల్‌సాగర్‌ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ)లో విధులు నిర్వర్తిస్తున్న నర్సు(ఏఎన్‌ఎం) అనపర్తి అరుణకుమారి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు సమాచారం అందినట్లు ఆమె పేర్కొన్నారు. నైటింగేల్‌ పురస్కారం లభించడం మరిచిపోలేని అనుభూతి అని, ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా అరుణకుమారి పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌ ఆరోగ్య కేంద్రం నర్సు శుక్రా కూడా ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు