
ప్రధానాంశాలు
తాళ్లపూడి, న్యూస్‌టుడే: గుండె సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి శస్త్రచికిత్స చేయించేయిందుకు సినీ నటుడు సోనూసూద్ ఆర్థిక సాయం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి దంపతుల కుమారుడు (8 నెలలు) గుండెలో సమస్య వచ్చింది. వీరికి శస్త్రచికిత్స చేయించే ఆర్థిక పరిస్థితి లేదు. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు కొఠారు శ్రీనివాస్ కుమారుడు షణ్ముఖ.. వీరి వివరాలను సోనూ సూద్ ట్రస్టుకు అంతర్జాలం ద్వారా తెలియజేసి సాయం కోరారు. ట్రస్టు అంగీకారం తెలిపి ముంబయిలోని ఎస్ఆర్సీసీ ఆసుపత్రిలో జనవరి 9న.. రూ.6 లక్షలు చెల్లించి చిన్నారికి గుండె శస్త్రచికిత్స చేయించింది. శనివారం గ్రామానికి చేరుకున్న వెంకటేశ్వరరావు, దేవి దంపతులు మాట్లాడుతూ సోనూసూద్ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం