close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎస్వీబీసీకి యూబీఐ రూ.50.55 లక్షల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో సంవత్సరంపాటు ధార్మిక, భక్తి కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.50,55,120 స్పాన్సర్‌షిప్‌ అందించింది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ సూచనల మేరకు తిరుపతి డీజీఎం దత్తాత్రేయ వెంకటేశ్వర శర్మ విరాళం డీడీని ఎస్వీబీసీ ఎండీ ఏవీ ధర్మారెడ్డికి శనివారం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ తిరుపతి ఏజీఎం చంద్రశేఖరరెడ్డి, తిరుమలశాఖ మేనేజరు సాంబశివరావు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు