
ప్రధానాంశాలు
సంఘాల నాయకుల అరెస్ట్
పీఆర్సీని అమలు చేయాలన్న వేదిక
రాంనగర్, న్యూస్‌టుడే: పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఐక్య వేదిక హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించతలపెట్టిన ఒక రోజు నిరాహార దీక్షను పోలీసులు భగ్నంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్- కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు శనివారం ఉదయం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరి 11 గంటలకు ఇందిరా పార్కు చౌరస్తాకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ధర్నాచౌక్‌లో ఎలాంటి ఆందోళనకు అనుమతిలేదని తెలిపారు. పరిమిత సంఖ్యలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామని నాయకులు తెలిపినా తిరస్కరించారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, సంపత్‌కుమారస్వామి, సదానంద్‌గౌడ్, లక్ష్మయ్యలు మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఐక్యవేదిక 79 సంఘాలతో ఏర్పడిందన్నారు. 3 నెలల్లో ఇస్తామన్న పీఆర్సీని 30 నెలలైనా ఇవ్వకపోవడంతో పోరాటానికి దిగామన్నారు. నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో 2018 జులై నుంచి నూతన వేతనాలు అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. అనంతరం ఐక్యవేదిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ముషీరాబాద్, చిక్కడపల్లి, గాంధీనగర్ ఠాణాలకు తరలించారు. ఆయా స్టేషన్లలో వారు దీక్ష కొనసాగించారు. వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.జంగయ్య, కె.లక్ష్మయ్య, మైస శ్రీనివాసులు, ఎం.రఘుశంకర్‌రెడ్డి, ఎం.రాధాకృష్ణ, కె.కృష్ణుడుతోపాటు 50 మంది అరెస్టయ్యారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50