
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం రికార్డుస్థాయిలో 187.3 గిగావాట్ల (ఒక గిగావాట్‌కు వెయ్యి మెగావాట్లు) విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈ నెల 20న అత్యధికంగా 185.8 గిగావాట్లు, గత ఏడాది డిసెంబరు 30న 182.89 గిగావాట్ల డిమాండ్ నమోదైంది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవటం, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగం మరింత పెరగటంతో విద్యుత్ డిమాండ్ క్రమేపీ పెరుగుతోంది. కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఐదు నెలలపాటు డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబరులో 1.7 శాతం, అక్టోబరులో 3.4 శాతం, డిసెంబరులో 7.3 శాతం వంతున పుంజుకుంది. తెలంగాణలోనూ విద్యుత్ డిమాండ్ శుక్రవారం ఉదయం అత్యధికంగా 13,157 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్రంలో శుక్రవారం విద్యుత్ వినియోగం 240 మిలియన్ యూనిట్లు కాగా.. గత ఏడాది ఇదే రోజు 220 మిలియన్ యూనిట్లు వినియోగమైనట్లు విద్యుత్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50