close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పదోన్నతులు

ఉద్యోగుల సమాఖ్యతో సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థల్లోనూ అమలుచేస్తామని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కొత్త వేతన సవరణ అమలు వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శనివారం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ రాజేశం, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్‌, నేతలు ఖలీమోద్దీన్‌, రవీందర్‌రెడ్డి తదితరులు సీఎస్‌ను బీఆర్‌కే భవన్‌లో కలిశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు కూడా పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. చాలాకాలంగా పదోన్నతులు లేకుండా ఒకే పోస్టులో ఉంటున్నామని, తమకు హోదాలు పెంచి న్యాయం చేయాలన్నారు. సీఎస్‌ మాట్లాడుతూ.. బేవరేజెస్‌, టీఎస్‌ఐఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల చక్కటి పనితీరును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ఆయా సంస్థలను ఆదేశించామన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ ప్రభుత్వరంగ సంస్థల 2021 దైనందినిని ఆవిష్కరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు