close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎమ్మార్‌ బియ్యానికి మరింత గడువు

ఫిబ్రవరి 28 వరకు పొడిగించిన కేంద్రం
సీఎం చొరవే కారణం: కమలాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గత ఏడాది యాసంగి బియ్యాన్ని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు  ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగించింది. జాప్యం కారణంగా బియ్యం తీసుకోవటాన్ని 25 రోజులుగా ఎఫ్‌సీఐ నిలిపివేసింది. క్షేత్రస్థాయి తనిఖీల తర్వాత బియ్యం స్వీకరణ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎఫ్‌సీఐని ఆదేశించింది. ఆ మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంతో కేంద్రం గడువు పొడిగించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాసంగిలో కస్టం మిల్లింగ్‌ రైస్‌(సీఎమ్మార్‌) కింద 43 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా డిసెంబరు 31 నాటికి 37 లక్షల మెట్రిక్‌ టన్నులు అప్పగించారు. మిగిలిన మొత్తం అప్పగించాల్సి ఉంది. ‘బియ్యం ఇవ్వటానికి గడువు పొడిగించిన నేపథ్యంలో మిల్లర్లు తక్షణం స్పందించి పని పూర్తిచేయాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు