close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఔత్సాహికుల గుర్తింపునకు జిల్లాల్లో ఫిల్మ్‌ ఛాంబర్‌ శాఖలు

టీఎఫ్‌సీ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఔత్సాహిక నటులు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులను గుర్తించి, వెలుగులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఫిల్మ్‌ ఛాంబర్‌ శాఖలను ఏర్పాటుచేస్తామని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌(టీఎఫ్‌సీ) ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ అన్నారు. ఆ సంస్థ తొలి జిల్లా శాఖను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తవారిని పరిశ్రమకు పరిచయం చేయడంతోపాటు చిత్రీకరణ స్థలాల(లోకేషన్లు) గుర్తింపు, అవసరాలు, అనుమతుల కోసం జిల్లాకో ఛాంబర్‌ అవసరమన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు