
ప్రధానాంశాలు
మరో నాలుగు జతల రైళ్లు కూడా
ఈనాడు, హైదరాబాద్: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ 27వ తేదీ నుంచి ప్రత్యేక రైలు (నం.07405/07406)గా పట్టాలు ఎక్కనుంది. లాక్‌డౌన్‌తో ఆగిన ఈ రైలు దాదాపు 10 నెలల విరామం అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. మొత్తం 59 స్టేషన్లలో ఆగే ఈ రైలు ప్రధానంగా ఏపీ, తెలంగాణ ప్రయాణికులతో పాటు మహారాష్ట్ర వాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. అటు తిరుపతి, ఇటు ఆదిలాబాద్ నుంచి ఈ రైలు ప్రతి రోజు ప్రయాణికులకు అందుబాటులో రానుంది. ఇప్పటివరకు పండగ ప్రత్యేక రైళ్లుగా నడిపిన మరో నాలుగు జతల రైళ్లను 27, 28, 29 తేదీల నుంచి ప్రత్యేక రైళ్లుగా నడపనుంది. వీటిలో సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లు ప్రయాణికులు అందుబాటులోకి రానున్నాయి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ₹50
- ప్రేమోన్మాది ఘాతుకం