close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వ నేత్రాధికారుల సంఘం అధ్యక్షుడిగా ప్రతాపగిరి ప్రసాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ నేత్రాధికారుల(ఆప్తాల్మిక్‌ ఆఫీసర్స్‌) సంఘం అధ్యక్షునిగా ప్రతాపగిరి ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన ప్రస్తుతం హుస్నాబాద్‌ ఆసుపత్రిలో నేత్రాధికారిగా పనిచేస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర నేత్రాధికారుల సంఘం సమావేశంలో ఆయనతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా పనాస ప్రవీణ్‌, కోశాధికారిగా కొంగ రమేశ్‌, ఇతర ప్రతినిధులు ఎన్నికయ్యారు. సమావేశంలో సంఘం నేత చుక్కా రవికుమార్‌, రాష్ట్ర అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సంచాలకురాలు కళావతి, ప్రజారోగ్య నిపుణుడు శ్యామన్న, 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు