
ప్రధానాంశాలు
బండచర్లపల్లి గ్రామస్థుల ఆందోళన
సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు తమ గ్రామంలో జలాశయం నిర్మిస్తే ఊరు మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా బండచర్లపల్లి గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేశారు. సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై భైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పినా వినలేదు. రహదారిపైనే వంటావార్పు చేపట్టారు. రోడ్డుపై వారు వేసిన టెంటును పోలీసులు తొలగించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి హరీశ్‌రావు వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. ఊరు ముంపునకు గురైతే తమ పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నీటిపారుదల శాఖ ఏఈ ఖాజా అక్కడకు చేరుకొని గ్రామంలో ఎలాంటి జలాశయం నిర్మించడం లేదని, గ్రామం ముంపునకు గురవదని స్పష్టంచేశారు. చెరువు అలుగు పారే సమయంలో ఎఫ్టీఎల్ ఆధారంగా చెరువు చుట్టూ రాతి కట్టడం ద్వారా నీటిని తరలిస్తామన్నారు. దీంతో గ్రామస్థులు ఆందోళనను విరమించారు.
చిన్నగుండవెల్లిలో ఆందోళన..
ప్రభుత్వం గతంలో చేపట్టిన సర్వే ప్రకారమే కాలువ నిర్మించాలని కోరుతూ సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లి రైతులు మంగళవారం సిద్దిపేట-దుబ్బాక రహదారిపై ధర్నా చేపట్టారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టి అక్కడే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితమే సర్వే చేసినా తమ పొలాలను కాపాడుకునేందుకు కొంతమంది నాయకులు కొత్త సర్వేను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. కొత్త సర్వే ప్రకారం కాలువ నిర్మిస్తే సన్న, చిన్నకారు రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- అట్టుడుకుతున్న రష్యా!
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..
- వేదికపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్
- ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్ మార్పు