close

ప్రధానాంశాలు

పుస్తకాల సంచుల బరువును తగ్గించండి

గవర్నర్‌కు లేఖ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పాఠశాల పుస్తకాల సంచుల బరువును తగ్గించి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌... గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరింది. గతంలో విద్యాశాఖ కమిషనర్‌ నిర్వహించిన సర్వేలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల సంచి బరువు 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాల విద్యార్థుల సంచి బరువు 12 నుంచి 17 కిలోలు ఉన్నట్లు గుర్తించారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఇంత బరువును పిల్లలు ప్రతిరోజు మోయడం వెన్నెముక, మోకాళ్లపై ప్రభావం చూపుతోందని, ఈ బరువును తగ్గించాలంటూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో.22 ఇచ్చిందని పేర్కొంది. అయితే గత రెండున్నరేళ్లుగా ఆ ఉత్తర్వుల అమలుకు ఎలాంటి చొరవ తీసుకోలేదని ఆరోపించింది. ఈ మేరకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం గవర్నర్‌కు లేఖ రాశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.