close
యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకోవాలి

  ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సర్కారు దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త మున్సిపాలిటీల్లో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులను పరిష్కరించటానికి ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో పురపాలికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 73 పురపాలక సంఘాలు, నగరపాలికల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు 2018 మార్చి 30 వరకు నమోదైన లేఅవుట్‌లకు అవకాశం కల్పించారు. 2015 నవంబరు 3 నుంచి పురపాలికలు, నగరపాలక సంస్థల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి ఇవ్వగా క్రమబద్ధీకరణ ప్రక్రియ మూడేళ్లపాటు సాగింది. వివిధ పురపాలక సంఘాలు దరఖాస్తులపై ఉదాసీనంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ తీరు పునరావృతం కాకుండా ఇప్పుడు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ విధానం తీసుకువచ్చినట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్దేశించిన నిషేధిత ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను అనుమతించరాదని, వీటికి సంబంధించి నిరభ్యంతర పత్రాలపై కఠినంగా వ్యవహరించాలని తెలియజేశారు. ఇప్పటికే పురపాలక సంఘాల్లో భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ అయినచోట ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియకు సమస్యలు ఉండవని, కొన్నిచోట్ల ఆ సమస్యలను అధిగమించాల్సి ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉత్తర్వులు ఈనెల 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించినా ఆన్‌లైన్‌ విధానం అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇంకా మొదలుకావాల్సి ఉంది. కొత్త మున్సిపాలిటీల్లో దరఖాస్తులు భారీగా వస్తాయని పురపాలకశాఖ అంచనా వేస్తోంది. ఇంత వరకూ గ్రామ పంచాయతీలుగా ఉండి పురపాలక సంఘాలుగా మారిన నేపథ్యంలో వాటి పరిధిలో అనుమతి లేకుండా వేసిన లేఅవుట్‌లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.