close
డిసెంబరులో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: మాతృభాష పరిరక్షణకు తెలుగు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించనున్నట్లు మహాసభల కార్యదర్శి జి.వి.పూర్ణచందు తెలిపారు. డిసెంబరు 27, 28, 29 తేదీల్లో విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వేదికగా ఈ సభలు జరుగనున్నాయని వెల్లడించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారి జీవనం, తెలుగు సంస్కృతి పరిరక్షణలో ఎదుర్కొంటున్న సమస్యలు, భాష పరిరక్షణ, అభివృద్ధి, తెలుగు భాషా సంస్కృతులు, చరిత్ర, సాంకేతిక ప్రగతి అంశాలపై ఈ సభల్లో ప్రధానంగా చర్చిస్తామన్నారు. వివరాలకు గవర్నర్‌పేట బకింగ్‌హాంపేట పోస్టాఫీస్‌ ఎదురుగా ఉన్న సంఘం కార్యాలయంలో నేరుగా లేదా 94401 72642, 82478 86959 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.