close
టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు

సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాలమల్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2016 అక్టోబరు 10న ఆయన టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నెల 10తో మూడేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో బాలమల్లు పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో బాలమల్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్ల పదవీకాలం తనకు సంతృప్తినిచ్చిందని, సంస్థ పురోగతికి శాయశక్తులా కృషిచేశానని చెప్పారు. రెండోసారి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషిచేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.