close
యురేనియం అన్వేషణ ఎప్పుడూ చేయలేదు: జీఎస్‌ఐ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం సహా భారతదేశంలో ఎక్కడా భూ వైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ (జీఎస్‌ఐ) యురేనియం నిక్షేపాల అన్వేషణ చేయలేదని సంస్థ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. యురేనియం సహా ఏ ఇతర ఆటమిక్‌ మినరల్స్‌ నిక్షేపాల అన్వేషణలో జీఎస్‌ఐ పాలుపంచుకోలేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20లో జీఎస్‌ఐ తెలంగాణలో 25 భూ సంబంధిత శోధనలు  చేసిందన్నారు. నల్గొండ జిల్లాలో భూగర్భజలంలో ఫ్లోరైడ్‌ కలిసిందా? అనే అంశ నిర్ధారణకు, వైద్య సంబంధిత అంశాల నిర్ధారణకు, రాతి నమూనాల గుర్తింపునకు తాము శోధనలు చేశామన్నారు. భూగర్భంలో ఫ్లోరైడ్‌, అనారోగ్య కారకాలైన భారీ లోహాలను గుర్తించడమే పరిశోధనల లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా జీఎస్‌ఐకి స్థానిక పాలనా యంత్రాంగం, ప్రజలు సహకరించాలని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.