close
అశ్వమేధ యానం

హైదరాబాద్‌ పాతబస్తీలో పర్యటించిన ఐపీఎస్‌, ఐఏఎస్‌లు
దేశంలోనే తొలిసారిగా వారసత్వ నడక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం తొలిసారిగా బ్యూరోక్రాట్ల వారసత్వ నడకకు వేదికైంది. ఆదివారం తెల్లవారుజామునే పలువురు ఉన్నతాధికారులు అశ్వారూఢులై పాతబస్తీలో పర్యటించారు. పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించి స్థానికులతో ముచ్చటించారు. యూరప్‌ దేశాల్లోని నగరాల్లో తరచూ కనిపించే ఈ తరహా వారసత్వ నడక దేశంలోనే తొలిసారిగా భాగ్యనగరంలో మొదలైంది. ఐఏఎస్‌లు అర్వింద్‌కుమార్‌, ముషర్రాఫ్‌, ఐపీఎస్‌ అంజనీకుమార్‌.. తదితర 12 మంది ఉన్నతాధికారులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే ఈ పర్యటనకు బయలుదేరారు. గోషామహల్‌ స్టేడియంలోని మౌంటెడ్‌ యూనిట్‌(అశ్వశాల) నుంచి అశ్వాలపై పర్యటన ప్రారంభించారు. 20 వరకు గుర్రాలతో మూసీ నదిని దాటుకొని మదీనా, పత్తర్‌గట్టి, చార్మినార్‌, మక్కా మసీదుల మీదుగా చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు ప్రయాణించారు. ఐఏఎస్‌ అధికారులు పాతబస్తీ గల్లీల్లో సంచరించి స్థానిక పరిస్థితుల గురించి ఆరా తీయగా.. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ గస్తీ బృందాలతోపాటు స్థానికులను కలిసి శాంతిభద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుతూనే పలువురు ఉన్నతాధికారులు తమ బస్తీల్లో పర్యటించడం స్థానికుల్లో ఆసక్తి రేపింది. ఈ తరహా వినూత్న పర్యటనల వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని నగర సీపీ వెల్లడించారు. హైదరాబాద్‌ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇండియన్‌ పోలో అసోసియేషన్‌ కెప్టెన్‌ పీఆర్‌ సింగ్‌, సిరాజ్‌ అత్తారి ప్రశంసించారు. తూర్పు మండలం, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు రమేశ్‌రెడ్డి, రాధాకృష్ణ వారసత్వ నడకలో పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.