Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 175782
            [news_title_telugu_html] => 

నీ మరణం.. తోడుగా నే పయనం

[news_title_telugu] => నీ మరణం.. తోడుగా నే పయనం [news_title_english] => [news_short_description] => దశాబ్దాల దాంపత్యం వారిది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్యోన్యం ఆ దంపతులది. ఒకరు దూరమైనా తట్టుకోలేని సున్నితత్వం వారిది. భార్య తనువు చాలించిన గంటల వ్యవధిలోనే భర్త తీరని వేదనతో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
నీ మరణం.. తోడుగా నే పయనం - EENADU
close
నీ మరణం.. తోడుగా నే పయనం

 భార్య మరణించిన కొన్నిగంటల్లోనే కన్నుమూసిన భర్త

కేసముద్రం, న్యూస్‌టుడే: దశాబ్దాల దాంపత్యం వారిది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్యోన్యం ఆ దంపతులది. ఒకరు దూరమైనా తట్టుకోలేని సున్నితత్వం వారిది. భార్య తనువు చాలించిన గంటల వ్యవధిలోనే భర్త తీరని వేదనతో కన్నుమూసిన ఉదంతమిది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామంలో జనగామ లచ్చమ్మ (83) అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం రాత్రి అసువులు బాసింది. ఆమె మృతి భర్త సాయిలును తీవ్రంగా కుంగదీసింది. రాత్రంతా తీవ్రంగా దుఃఖించాడు. సోమవారం ఉదయం లచ్చమ్మ అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తుండగా హఠాత్తుగా మృతి చెందాడు. దీంతో లచ్చమ్మ అంతిమయాత్ర నిలిపివేసి సాయిలు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఇద్దరి అంతిమయాత్రను ఒకేసారి నిర్వహించారు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మరణం గ్రామస్థులను కలచివేసింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.