close
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు 

14న ఓటర్ల జాబితా ప్రచురించండి 
ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఓటర్ల జాబితాల ప్రచురణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు మేరకు ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలని మార్గదర్శనం చేశారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల కమిషనర్లకు ఎన్నికల సంఘం శిక్షణ సదస్సు నిర్వహించింది. కార్యదర్శి అశోక్‌కుమార్‌, పురపాలకశాఖ సంచాలకురాలు టి.కె.శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీన ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఆదేశాలిచ్చారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో రాజకీయ పార్టీల నేతలతో గురువారం సమావేశమై పోలింగ్‌ కేంద్రాల ముసాయిదాపై పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి అయితేనే పోలింగ్‌ కేంద్రాలను మార్చాలని స్పష్టం చేశారు. అనంతరం ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లను సమీక్షించారు. ఓటర్ల జాబితాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని పురపాలక శాఖ సంచాలకురాలు శ్రీదేవి సూచనలిచ్చారు. ఓటర్ల జాబితా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.