close

తాజావార్తలు

‘కోహ్లీకి కోహ్లీనే పోటీ’

సచిన్‌ కూడా అలానే చేశాడు: రవిశాస్త్రి

చెన్నై: భారత సారథి విరాట్‌ కోహ్లీని టీమిండియా కోచ్ రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీ తనకి తానే పోటీ అని, అతడు ఎవరితో పోటీ పడడని రవిశాస్త్రి అన్నాడు. ‘‘కోహ్లీకి సమీపంలో ఎవరూ లేరు. బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌, అంబాసిడర్‌గా కోహ్లీ అదరగొడుతున్నాడు. క్రీడలకు అతడే ప్రచారకర్త. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎవరి ఆటను చూడటానికి ఇష్టపడతారని పిల్లల్ని అడగండి. ఎక్కువ శాతం మంది విరాట్‌ కోహ్లీ అనే చెబుతారు. నేను బాల్యంలో ఉంటే కోహ్లీ ఆటనే చూస్తాను. అతడు అద్భుతంగా ఆడతాడు. ఆట విలువల్ని గొప్పగా పాటిస్తాడు. ప్రతి బాలుడికి అతడు రోల్‌ మోడల్‌.’’ అని తెలిపాడు.

‘‘కోహ్లీ రోజు రోజుకి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నాడు. అతడికి ఎవరూ పోటీలేరు. అతడికి అతడే పోటీ. అతడో బెంచ్‌మార్క్‌. కొత్త రికార్డులను సృష్టిస్తూ తన రికార్డులను తిరగ రాస్తున్నాడు. సచిన్‌ కూడా అలానే చేశాడు. ‘ నీ వయస్సులో ఇన్ని శతకాలు ఎవరూ బాదలేరు’ అని సచిన్‌తో నేను అన్నాను. అలా శతకాలు సాధించడం అంత సులువైనది కాదు. కోహ్లీ ఎవరిని అనుకరించడు. అతడికి మేమంతా ఒకటే చెబుతాం. ‘విరాట్‌ కోహ్లీలా ఉండు’ అని. విరాట్‌ శకాన్ని మనం ఆస్వాదించాలి’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ల్లో కోహ్లీ అన్ని ఫార్మాట్లలో టాప్‌-10లో ఉన్నాడు. టెస్టుల్లో, వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20ల్లో పదో స్థానంలో నిలిచాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.