
తాజావార్తలు
ముంబయి: అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నీలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. 762 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఓ జట్టు కేవలం 7 పరుగులకే కుప్పకూలింది. అందులోని 10 మంది బ్యాట్స్‌మెన్ డకౌట్లే అయ్యారు. చేసిన 7 పరుగులూ ప్రత్యర్థి జట్టు అదనంగా ఇచ్చినవే కావడం గమనార్హం. ముంబయిలోని హ్యారిస్ షీల్డ్ పోటీల్లో చిల్డ్రన్స్ వెల్ఫేర్ పాఠశాల పరిస్థితి ఇదీ. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో న్యూఎరా క్రికెట్ క్లబ్లో స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ (ఎస్వీఐఎస్), చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ మధ్య బుధవారం అండర్-16 తొలిరౌండ్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్వీఐఎస్ 39 ఓవర్లలో 761 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాడు మీత్ మయేకర్ (338; 134 బంతుల్లో 56×4, 7×6) అజేయ త్రిశతకం బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అతడికి తోడుగా క్రిష్ణ పార్థ్ (95), ఇషాన్ రాయ్ (67) రాణించారు. వీరి చెలరేగడానికి తోడు చిల్డ్రన్స్ అకాడమీ కేటాయించిన సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అంపైర్లు 156 పరుగుల పెనాల్టీ విధించారు.
ఛేదనకు దిగిన చిల్డ్రన్స్ అకాడమీ జట్టును ఎస్వీఐఎస్ బౌలర్లు బెంబేలెత్తించారు. అలోక్ పాల్ (3-0-3-6), వరోద్ వేజ్ (3-1-3-2) భారీ దెబ్బకొట్టారు. వీరిద్దరూ కలిసి 8 వికెట్లు తీశారు. మిగతా ఇద్దరూ రనౌట్ అయ్యారు. ఛేదనలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎవరూ పరుగుల ఖాతా తెరవలేదు. ఆ 7 అదనపు పరుగులే. కేవలం 6 ఓవర్లలో వీరి ఆట ముగిసింది. వివేకానంద పాఠశాల 754 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఈ పాఠశాల పూర్వవిద్యార్థే కావడం గమనార్హం. సాధారణంగా హ్యారిష్ షీల్డ్ తొలి రెండు రౌండ్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని ఎంసీఏ వెల్లడించింది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం