
తాజావార్తలు
ముంబయి: వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసుల కోసం గురువారం జట్లను ప్రకటించే అవకాశం ఉంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ రేపు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుందని సమాచారం. వెస్టిండీస్ డిసెంబర్ 6 నుంచి ఉపఖండంలో పర్యటించనుంది. టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీపై అందరి దృష్టి నెలకొంది.
చాన్నాళ్ల తర్వాత ఝార్ఖండ్ మైదానంలో సాధన చేయడంతో అభిమానులు మహీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా అతడు ఈ సిరీసులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐలోని ఓ సీనియర్ అధికారి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ బ్యాటు, గ్లోవ్స్‌తో విఫలమవుతున్నప్పటికీ మళ్లీ అవకాశం ఇస్తారనే తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో చోటు దక్కని సంజు శాంసన్‌కు ఈ సారైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి. యువ బౌలర్ల ఎంపికలో ఎలాంటి మార్పులు ఉంచకపోవచ్చని తెలుస్తోంది. టీ20లు రాత్రి 7 గంటలు, వన్డేలు మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభమవుతాయి.
భారత్‌లో వెస్టిండీస్ పర్యటన వివరాలు
తొలి టీ20 - డిసెంబర్ 6, శుక్రవారం (ముంబయి)
రెండో టీ20 - డిసెంబర్ 8, ఆదివారం (తిరువనంతపురం)
మూడో టీ20- డిసెంబర్ 11, బుధవారం (హైదరాబాద్)
తొలి వన్డే - డిసెంబర్ 15, ఆదివారం (చెన్నై)
రెండో వన్డే - డిసెంబర్ 18, బుధవారం (విశాఖపట్నం)
మూడో వన్డే - డిసెంబర్ 22, ఆదివారం (కటక్)
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!