
తాజావార్తలు
హాంకాంగ్: వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి పరాభవం ఎదురైంది. గతవారం చైనా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన సైనా.. తాజాగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ నిరాశపర్చింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 9వ సీడ్ సైనా 13-21, 20-22తో చైనా క్రీడాకారిణి కాయ్ యాన్ యాన్ చేతిలో ఒడిపోయింది.
కేవలం 30 నిమిషాల్లోనే సైనా ప్రత్యర్థి ముందు తలవంచింది. తొలి గేమ్‌లో కాయ్ యాన్ యాన్ దూకుడు ముందు తేలిపోయిన సైనా.. ఆ తర్వాత రెండో గేమ్‌లో గట్టిపోటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫలితం లభించలేదు. కాగా, గతవారం జరిగిన చైనా ఓపెన్‌లోనూ సైనా ఇదే క్రీడాకారిణి చేతిలోనే ఓటమి చవిచూసింది.
ఈ సీజన్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన సైనా.. ఆ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతోంది. సైనా ఇలా తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఈ సీజన్లో ఇది 8వ సారి కావడం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే