close

తాజావార్తలు

సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓటమి

చైనా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో ఓటమి

ఫుఝౌ: చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌ శెట్టి స్ఫూర్తిదాయ ప్రదర్శన ముగిసింది. మూడుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ మార్కస్‌ ఫెర్నాల్ది, కెవిన్‌ సంజయ సుకముల్జో (ఇండోనేషియా)పై పోరాడి ఓడింది. హోరీహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత ద్వయం 16-21, 20-22 తేడాతో వరుస గేముల్లో తలవంచింది. ఈ ఇండొనేషియా జోడీ చేతిలో భారత జంట ఓడిపోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి.

సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఈ ఏడాది అద్భుతంగా ఆడుతోంది. ఆగస్టులో థాయ్‌ల్యాండ్‌ ఓపెనర్‌ సూపర్‌ 500 టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అనూహ్యంగా సెమీస్‌ చేరిన ఈ జోడీకి చైనా ఓపెన్‌లో ఓటమి తప్పలేదు. మ్యాచ్‌లో రెండో జోడీలు సుదీర్ఘ ర్యాలీలు ఆడాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.