close

తాజావార్తలు

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శ్రీకాంత్‌, కశ్యప్‌ ఓటమి

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత ప్రధాన షట్లర్ల కథ ముగిసింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లోనే కిదాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌ ఇంటిముఖం పట్టారు. చైనీస్‌ తైపీకి చెందిన చౌ టిన్‌ చెన్‌తో 55 నిమిషాలు పోరాడిన శ్రీకాంత్‌ 15-21, 21-7, 21-14 తేడాతో ఓటమి చవిచూశాడు. మరో ఆటగాడు కశ్యప్‌ మరీ పేలవంగా ఆడాడు. హాంకాంగ్‌ షట్లర్‌ లాంగ్‌ ఆంగుస్‌తో జరిగిన పోరులో 11-21, 9-21 తేడాతో వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు.

యువ షట్లర్‌ సమీర్‌ వర్మదీ అదే పరిస్థితి. జపాన్‌ ఆటగాడు కెంటా నిషిమోటోతో జరిగిన తొలి రౌండ్లో 22-20, 18-21, 18-21 తేడాతో హోరాహోరీ పోరాడి ఓడాడు. శుభంకర్‌ ఒక్కడే రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఇండోనేషియా షట్లర్‌ షెసర్‌ హిరెన్‌ రుస్తవిటోతో తలపడనున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌, అశ్విని పొన్నప్ప జోడీ 17-21, 18-21 తేడాతో కొరియా ద్వయం, నాలుగో సీడ్‌ సియో సుంగ్‌ జే, చే యుజుంగ్‌ చేతిలో ఓడింది. ప్రణవ్‌ చోప్రా, సిక్కిరెడ్డి జంట 13-21, 18-21 తేడాతో ఇంగ్లాండ్‌ జోడీ క్రిస్‌ అడ్‌కాక్‌, గ్యాబ్రియేల్‌ అడ్‌కాక్‌తో జరిగిన పోరులో ఓటమి పాలైంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.