close

తాజావార్తలు

సిక్సర్లలోనూ హిట్‌మ్యానే

ధోనీని అధిగమించిన రోహిత్‌..

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో  రోహిత్‌ శర్మ(140) శతకంతో చెలరేగి భారత ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించాడు. ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారత్‌ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 24 శతకాన్ని అందుకున్నాడు. కాగా, ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది మూడో శతకం. తొలి శతకం 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సాధించగా, మిగతా రెండు శతకాలు(దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై) ఈ ప్రపంచకప్‌లోనే అందుకున్నాడు.

ఇదిలా ఉండగా, సిక్స్‌లు కొట్టడంలో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన రోహిత్‌ ఈ మ్యాచ్‌లోనూ మూడు సిక్స్‌లు సాధించి ఇప్పటివరకూ మహేంద్రసింగ్‌ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో(అన్ని ఫార్మాట్‌లలో కలిపి) భారత్‌ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా ధోనీ(355) పేరిట ఈ రికార్డు ఉండేది. తాజాగా పాక్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌(358) మూడు సిక్సర్లు కొట్టి ధోనీ రికార్డును అధిగమించాడు.  

ఈ రికార్డు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ల జాబితాలో సచిన్‌ తెందుల్కర్‌(264), యువరాజ్‌ సింగ్‌(251), సౌరవ్‌ గంగూలీ(247), వీరేంద్ర సెహ్వాగ్‌(243) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.