close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
25 నుంచి ఆర్చర్లకు జాతీయ శిబిరం

దిల్లీ: ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించినా, అర్హత సాధించే అవకాశాలు ఉన్న ఆర్చర్లకు జాతీయ శిక్షణ శిబిరం తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) గురువారం ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి మధ్యలో నిలిపివేసిన ఈ శిబిరాన్ని తిరిగి పుణేలోని ఆర్మీ క్రీడా సంస్థ (ఏఎస్‌ఐ)లో నిర్వహించనున్నారు. 16 మంది రికర్వ్‌ ఆర్చర్లు (ఎనిమిది మంది చొప్పున పురుషులు, మహిళలు), నలుగురు కోచ్‌లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఈ నెల 25న ఏఎస్‌ఐలో రిపోర్ట్‌ చేయాలి. వాళ్లు ఆ ప్రాంగణంలోనే 14 రోజుల క్వారంటైన్‌లో ఉంటారు. శిబిరానికి హాజరయ్యే ఆర్చర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి తప్పనిసరిగా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేస్తారని సాయ్‌ తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.