close
డబుల్స్‌ జోడీల జోరు

ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ బ్యాడ్మింటన్‌

ఖాట్మాండు: నేపాల్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ జోడీలు అదరగొడుతున్నాయి. పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి- మను అత్రి, అర్జున్‌- ధ్రువ్‌ జంటలు ఫైనల్లో అడుగుపెట్టాయి. శనివారం సెమీస్‌లో సుమీత్‌- మను జోడీ 18-21, 21-19, 21-19 తేడాతో కిమ్‌ డక్‌యంగ్‌- కిమ్‌ సా రంగ్‌ (కొరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో పరాజయం ఎదురైనప్పటికీ గొప్పగా పుంజుకున్న భారత జోడీ మిగతా రెండు గేమ్‌ల్లో గెలిచి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో అర్జున్‌- ధ్రువ్‌ ద్వయం 21-16, 21-16తో సంగ్‌- వాంగ్‌ చన్‌ (కొరియా)ను వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. ఆదివారం పురుషుల డబుల్స్‌ ఫైనల్‌ ఈ రెండు భారత జోడీల మధ్యే జరగనుంది. మహిళల డబుల్స్‌లో మనీష- రుతపర్ణ జోడీ టైటిల్‌ పోరుకు చేరింది. మనీష- రుతపర్ణ 17-21, 23-21, 21-17తో కొరెపాప్‌- క్వంచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్‌ జోడీ.. సెత్యానా- గ్రోన్యా (ఆస్ట్రేలియా)తో తలపడనుంది. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌- కుహూ గార్గ్‌ జంట 21-15, 20-22, 17-21తో కిమ్‌ సా రంగ్‌- కిమ్‌ హా నా (కొరియా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ సిరిల్‌ వర్మ 11-21, 16-21తో ఆరో సీడ్‌ కువాంగ్‌ ఫామ్‌ (వియత్నాం) చేతిలో ఓడాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.