close
ఫైనల్లో శివాని

అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌

పుణె: అఖిల భారత సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి రుత్విక శివాని ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో శివాని 16-21, 21-14, 21-12 తేడాతో సామియా ఫరూఖీపై విజయం సాధించింది. తొలి గేమ్‌లో తడబడి ఓటమి వైపు నిలిచిన శివాని ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. తన పూర్తిస్థాయి ఆటతీరుతో చెలరేగి రెండు, మూడు గేమ్‌లను గెలుచుకుని టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం ఫైనల్లో శివాని.. శ్రుతితో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌- శ్లోక్‌ రామచంద్రన్‌ జోడీ తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో కృష్ణప్రసాద్‌- రామచంద్రన్‌ జంట 21-14, 21-10తో శ్రీకృష్ణ- గౌస్‌ షేక్‌పై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో సాహితి- నీల ద్వయం 21-14, 21-10తో సామియా- కవిప్రియపై గెలిచి ఫైనల్‌ చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌- అశ్విని భట్‌ జంట 21-17, 21-17తో ఇషాన్‌- తనీషపై నెగ్గి సెమీస్‌ గడప దాటింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.