close
సాత్విక్‌ జోడీ అదుర్స్‌

సెమీస్‌లో భారత క్రీడాకారులు
మూడో ర్యాంకు జంటకు షాక్‌
చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఫుజౌ (చైనా)

భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ అదరగొడుతోంది. చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో మూడో ర్యాంకు జోడీకి షాకిచ్చి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇటీవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌- చిరాగ్‌ జోడీ వరుసగా రెండో టోర్నీలో సెమీస్‌ చేరడం విశేషం. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ 21-19,  21-15తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత, మూడో సీడ్‌ జున్‌ హుయ్‌- యు చెన్‌ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది. 43 నిమిషాల పాటు సాగిన పోరులో తమకంటే మెరుగైన జోడీపై సాత్విక్‌ జంట అన్ని రంగాల్లోనూ పైచేయి సాధించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో 9వ ర్యాంకు జంట సాత్విక్‌- చిరాగ్‌ అద్భుతంగా పోరాడింది. 8 పాయింట్ల వరకు ఇరు జోడీలు సమంగా పోరాడాయి. ఈ సమయంలో వరుసగా 4 పాయింట్లతో సాత్విక్‌ జోడీ ఆధిక్యం సంపాదించింది. 16-13తో మరింత ముందంజ వేసింది. ఐతే జున్‌- చెన్‌ జోడీ వరుసగా 4 పాయింట్లు నెగ్గి 17-16తో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలక సమయంలో పుంజుకున్న సాత్విక్‌-చిరాగ్‌ 20-18తో తొలి గేమ్‌కు చేరువయ్యారు. 21-19తో తొలి గేమ్‌ గెలిచారు. రెండో గేమ్‌లో సాత్విక్‌ జోడీ మరింత ఆధిపత్యం కనబరిచింది. 12 పాయింట్ల వరకే చైనా జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైంది. ఆ తర్వాత ఆటంతా సాత్విక్‌- చిరాగ్‌లదే. శనివారం జరిగే సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ మార్కస్‌- కెవిన్‌ (ఇండోనేసియా) జంటతో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ తలపడుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు జోడీలు ఏడు సార్లు తలపడగా.. ఏడింట్లోనూ ప్రత్యర్థి జంటదే పైచేయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో మార్కస్‌- కెవిన్‌ జోడీ చేతిలో సాత్విక్‌- చిరాగ్‌ జంట ఓడింది. శనివారం నాటి సెమీస్‌లో గెలిచి ప్రపంచ నంబర్‌వన్‌ జంటపై సాత్విక్‌ జోడీ ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.