close
సిక్స్‌తో ద్విశతకం బాదిన రోహిత్‌శర్మ

భారీ స్కోర్‌ దిశగా టీమిండియా 

రాంచీ: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(212; 255 బంతుల్లో 28x4, 6x6) టెస్టుల్లో తొలిసారి డబుల్‌ సెంచరీ సాధించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో హిట్‌మ్యాన్‌ శనివారం సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం లంచ్‌ విరామానికి ముందు 199 పరుగులకు చేరుకున్నాడు. భోజనం తర్వాత సిక్స్‌ కొట్టి ద్విశతకం పూర్తిచేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 224/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన రోహిత్‌, వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె(115; 192 బంతుల్లో 17x4, 1x6) ధాటిగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో టీమిండియా స్కోర్‌ 300 దాటాక రహానె ఔటయ్యాడు. అనంతరం జడేజాతో జట్టు కట్టిన ఓపెనర్‌ ద్విశతకం సాధించాక రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎంగిడి చేతికి చిక్కాడు.

కాగా రోహిత్‌శర్మ ఈ సిరీస్‌లోనే టెస్టుల్లో ఓపెనర్‌గా మారిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో హిట్‌మ్యాన్‌‌(176, 127) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలతో చెలరేగాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 203 పరుగులతో విజయం సాధించింది. రెండో టెస్టులో రోహిత్‌ 14 పరుగులకే నిరాశపర్చినా కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 137 పరుగులతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం చేయడం విశేషం. ఇదిలా ఉండగా వన్డేల్లో రోహిత్‌ ఇదివరకే మూడు ద్విశతకాలు చేసిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని విధంగా రోహిత్‌ మూడు సార్లు (264, 209, 208నాటౌట్‌) ఈ ఘనత సాధించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.