close
బ్యాడ్మింటన్‌ ఫైనల్లో సాయిప్రసాద్‌, దీప్షిక

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సాయి ప్రసాద్‌, దీప్షిక (రంగారెడ్డి) సత్తాచాటుతున్నారు. అండర్‌-13 బాలుర సింగిల్స్‌లో ప్రసాద్‌, బాలికల సింగిల్స్‌లో దీప్షిక ఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం చేతన్‌ ఆనంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో జరిగిన సెమీస్‌లో టాప్‌ సీడ్‌ ప్రసాద్‌ 21-11, 15-21, 21-13 తేడాతో మూడో సీడ్‌ రోహన్‌ కుమార్‌ (రంగారెడ్డి)పై గెలిచాడు. బాలికల సెమీస్‌లో దీప్షిక 21-13, 21-19తో వెన్నెలపై విజయం సాధించింది. బాలుర డబుల్స్‌లో సాయి శంకర్‌- జ్ఞాన దత్తు (రంగారెడ్డి) జోడీ సెమీస్‌ చేరగా..  బాలికల డబుల్స్‌లో తన్విరెడ్డి- శ్రీవల్లి ద్వయం (రంగారెడ్డి)  క్వార్టర్స్‌ గడప దాటింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.