close
రాణించిన అనికేత్‌, వైష్ణవ్‌

హైదరాబాద్‌ గెలుపు
వినూమాన్కడ్‌ ట్రోఫీ

సూరత్‌: వినూ మాన్కడ్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో అనికేత్‌ రెడ్డి (4/18), బ్యాటింగ్‌లో వైష్ణవ్‌ రెడ్డి (48 నాటౌట్‌) రాణించడంతో శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన త్రిపుర 32.4 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. అనికేత్‌తో పాటు రక్షణ్‌రెడ్డి (3/25) కూడా చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్‌ 17 ఓవరల్లో ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్‌ వైష్ణవ్‌ రెడ్డి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.