close
ఎస్‌సీఆర్‌ మరో విజయం

రహీం లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎ- డివిజన్‌ రహీం లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఎస్‌సీఆర్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో శనివారం జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌సీఆర్‌ 3-0 తేడాతో ఎస్‌బీఐపై విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం చలాయించిన ఎస్‌సీఆర్‌ స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. 38వ నిమిషంలో గోల్‌ కొట్టిన సంతోశ్‌ జట్టు ఖాతా తెరిచాడు. మరో నాలుగు నిమిషాలకే కమీయా (42వ నిమిషంలో) గోల్‌తో జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ ఆ జట్టు దూకుడు కొనసాగింది. ప్రత్యర్థి ఆటగాళ్లు కాస్త పుంజుకొని ఎస్‌సీఆర్‌ జట్టుకు కళ్లెం వేయాలని ప్రయత్నించారు. కానీ ఆ జట్టు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివర్లో చంద్రశేఖర్‌ (88వ నిమిషంలో) గోల్‌ కొట్టి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.