close
యంగ్‌మెన్‌ విజయం

హైదరాబాద్‌ బాస్కెట్‌బాల్‌ లీగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షిక బాస్కెట్‌బాల్‌ లీగ్‌లో యంగ్‌మెన్‌ గిల్డ్‌ ముందంజ వేసింది. లెవెల్‌-3 మ్యాచ్‌లో యంగ్‌మెన్‌ 45-28తో హైదరాబాద్‌ రోవర్స్‌పై నెగ్గింది. యంగ్‌మెన్‌ జట్టులో నిహాల్‌ (13), కునాల్‌ (12), ప్రణవ్‌ (7)), అనురాగ్‌ (6).. రోవర్స్‌ తరఫున మోహన్‌ (8), గణేశ్‌ (5), నితిన్‌ (4), శంకర్‌ (4), పవన్‌ (4) సత్తాచాటారు. టీమ్‌ స్విష్‌ 55-31తో సండే బాస్కెట్‌ బాలర్స్‌పై గెలిచింది. స్విష్‌ తరఫున అఖిలేష్‌ (15), నవనీల్‌ (14), సిమ్రన్‌వాసు (10).. సండే జట్టులో రామారావు (10), రఘు (7), శిశిర్‌ (5) రాణించారు. హెచ్‌ఏఎల్‌ 46-36తో ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలపై గెలుపొందింది. హెచ్‌ఏఎల్‌ జట్టులో ఎస్‌.వి.సింగ్‌ (17), రవి (9), ఆశిష్‌ (9).. ఎంవీఎస్‌ఆర్‌ తరఫున సాంబ (22), శ్యామ్‌ (9) మెరిశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.