close
ఫజల్‌ పట్టు అదరహో

 హరియాణాపై ముంబా విజయం
 ప్రొ కబడ్డీ లీగ్‌

గ్రేటర్‌ నోయిడా: యు ముంబా కెప్టెన్‌ ఫజల్‌ అత్రచలి (8) ట్యాక్లింగ్‌లో అదరగొట్టాడు. అతనితో పాటు అజింక్య కాప్రె (10), డాంగ్‌ లీ (9) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటడంతో ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో ఆ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబా 39-33 తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఆరంభం నుంచి మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. తొలి పది నిమిషాల ఆట ముగిసే సరికి స్కోరు 9-9తో సమమైంది. అక్కడి నుంచి ఉత్కంఠ పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. పాయింట్‌ పాయింట్‌కు ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. తొలి అర్ధభాగం 15-15తో ముగిసింది. విరామం తర్వాత వినయ్‌ (11), వికాస్‌ ఖండోలా (6) రైడింగ్‌లో రాణించడంతో ఆధిపత్యం ప్రదర్శించిన హరియాణా.. ముంబాను ఆలౌట్‌ చేసి 22-18 ఆధిక్యం సంపాదించింది. అజింక్య, ఫజల్‌ మెరవడంతో వెంటనే పుంజుకున్న ముంబా.. హరియాణాను ఆలౌట్‌ చేసి 28-24తో నిలిచింది. తెలివిగా వ్యవహరిస్తూ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వెళ్లింది. మరో ఐదు నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉందనగా ఆ జట్టు 34-31తో విజయం దిశగా అడుగులు వేసింది. చివరి వరకూ ఆధిక్యాన్ని నిలుపుకొని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌ చేరిన సంగతి తెలిసిందే.

ప్రొ కబడ్డీలో ఈనాడు
దబంగ్‌ దిల్లీ × యు ముంబా
(రా.7:30 నుంచి)
యూపీ యోధ × బెంగళూరు బుల్స్‌
(రా.8:30 నుంచి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.