close

పడిలేచిన కెరటం.. రవీంద్ర జడేజా

విమర్శలెదురైన ప్రతీసారి నిరూపించుకున్నాడు

మాంచెస్టర్‌: రవీంద్రజడేజా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి పదేళ్లయినా వన్డేల్లో పూర్తిస్థాయి ఆటగాడిగా కొనసాగలేకపోయాడు. అప్పుడప్పుడూ మెరిసినా టెస్టు క్రికెటర్‌గానే పరిమితమయ్యాడు. విమర్శలెదురైన ప్రతీసారి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. చాహల్‌, కుల్‌దీప్‌ల రాకతో వన్డేల్లో అతడి స్థానమే కష్టతరమైంది. వన్డేల్లో ఇక రాలేడనుకున్న సమయంలో ప్రపంచకప్‌లో చోటుదక్కింది. లీగ్‌ దశలో అవకాశం రాకపోయినా ఎదురు చూశాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోయిన కీలక సెమీఫైనల్స్‌లో విజృంభించాడు. మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ చేసిన వ్యాఖ్యలకు ట్వీట్‌తో పాటు బ్యాట్‌తోనూ గట్టి జవాబిచ్చాడు. తాను పార్ట్‌టైం క్రికెటర్‌ కాదనే విషయాన్ని చాటిచెప్పాడు.

టాప్‌ఆర్డర్‌ కుప్పకూలి, పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్న కఠిన పరిస్థితుల్లో రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 1x4, 1x6) మైదానంలోకి అడుగుపెట్టి గొప్ప పోరాటం చేశాడు. 92/6తో ఘోర పరాభవానికి చేరువైన జట్టును 200 పరుగులు దాటించి ఆశలుపెంచాడు. ధోనీ(50; 72 బంతుల్లో 1x4, 1x6) ఉన్నాడనే ధీమా అతడి బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది. కొండంత లక్ష్యాన్ని కరగదీశాడు. కచ్చితమైన షాట్లు ఆడుతూనే విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. కివీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఎదురొడ్డి నిలబడ్డాడు. భారత్‌ ఓడిపోయినా తన అద్భుత ప్రదర్శనతో హీరో అయ్యాడు జడేజా.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.