Avi Barot: షాకింగ్‌.. అండర్‌-19 మాజీ కెప్టెన్‌ మృతి

తాజా వార్తలు

Published : 16/10/2021 23:46 IST

Avi Barot: షాకింగ్‌.. అండర్‌-19 మాజీ కెప్టెన్‌ మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌరాష్ట్ర బ్యాటర్‌, భారత అండర్‌-19 మాజీ కెప్టెన్‌ అవి బారోత్‌ గుండెపోటుతో మృతిచెందాడు. యువ ఆటగాడి మృతితో దేశవాళీ క్రికెట్‌లో విషాద ఛాయలు నిండాయి. 29 ఏళ్ల అవి బారోత్‌ హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించాడు. 2019-20 రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. గుజరాత్‌కు చెందిన ఈ యువ క్రికెటర్‌ అహ్మదాబాద్‌లో తల్లి, భార్యతో కలిసి ఉంటున్నాడు. అతడి భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. అవి బారోత్‌ శుక్రవారం ఇంట్లో ఒక్కసారిలో కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని హుటాహుటీని ఆసుపత్రికి తరలించారు. దారి మధ్యలోనే అతడు మృతిచెందినట్లు సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (SCA) అధ్యక్షుడు జయ్‌దేవ్‌ షా వెల్లడించారు. గత వారం స్థానికంగా జరిగిన ఓ టోర్నీలోనూ అతడు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ అయిన అవి బారోత్‌ 2011లో అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌. ఇప్పటివరకు 21 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. 38 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 1547 పరుగులు చేశాడు. 38 ఏ లిస్ట్‌ మ్యాచ్‌ల్లో 1030 పరుగులు, మరో 20 డొమెస్టిక్‌ టీ20 మ్యాచ్‌లు ఆడి  717 రన్స్‌ సాధించాడు. 2019-20లో బెంగాల్‌ను ఓడించి రంజీ ట్రోఫీ గెలిచిన సౌరాష్ట్ర జట్టుకు అవి ప్రాతినిథ్యం వహించాడు. ‘అవి మృతితో ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నాం. మా గుండెలు బాధతో నిండిపోయాయి. సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు’ అని ఎస్‌సీఏ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని