close

తాజా వార్తలు

Updated : 29/09/2020 22:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అతి త్వరలోనే హీరోని విలన్‌గా మార్చేస్తారు

దుబాయ్‌: తనపై ఎటువంటి ఒత్తిడి లేకపోవడంతో దిల్లీ తరఫున స్వేచ్ఛగా ఆడుతున్నాని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్ వెల్లడించాడు. అంతేకాక బిగ్‌బాష్‌ లీగ్‌లో రాణించిన విశ్వాసంతో దుబాయ్‌ వేదికగా జరుగుతున్న లీగ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగానని తెలిపాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టాయినిస్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 21 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. 31 ఏళ్ల ఈ ఆసీస్‌ ఆటగాడు బిగ్‌బాష్‌ లీగ్‌లోని ఇటీవల జరిగిన 9వ సీజన్‌లోనూ అలరించాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున ఆడిన అతడు 705 పరుగులు సాధించి పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. గత ఏడాది బెంగళూరు తరఫున ఆడిన విషయం తెలిసిందే.

‘‘ఈ ఏడాది చేసిన మంచి ప్రదర్శనతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను. అంతేకాక గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నాపై బాధ్యతలు, అంచనాలు పెద్దగా లేవు. యువకుడిగా జట్టులోకి వచ్చినప్పుడు, అంచనాలు అధికంగా ఉన్నప్పుడు అద్భుత ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తుంటాం. కొన్ని సార్లు విఫలమవుతుంటాం. అయితే ఈ ఏడాది స్వేచ్ఛగా నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలనుకుంటున్నా. నేను గొప్ప ప్రదర్శన చేసింది ఒక్క మ్యాచ్‌ మాత్రమే. ఇంకా మున్ముందు ఎన్నో మ్యాచ్‌లు ఉన్నాయి. అతి త్వరలో మీరు హీరోని విలన్‌గా మార్చేస్తారు. ప్రస్తుతం నా దృష్టంతా నా ఆటపై నమ్మకం ఉంచి పరుగులు సాధించడమే’’ అని స్టాయినిస్‌ వెల్లడించాడు.

‘‘ఈ స్థాయిలో క్రికెట్‌ ఆడుతున్నామంటే ఆటని ఎంతో ప్రేమిస్తున్నామని అర్థం. అదే మాకు ప్రేరణ ఇస్తుంది. జట్టు కోసం గొప్ప ప్రదర్శన చేస్తే గొప్ప సంతృప్తినిస్తుంది. ఇక జట్టుగా మేం ఎంతో సమతూకంగా ఉన్నాం.  గొప్ప కోచ్‌, నాయకుడు రికీ పాంటింగ్‌ మా తరఫున ఉన్నాడు. జట్టులో నైపుణ్యమున్న యువకులు మా సొంతం. వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. అంతేకాక మంచి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మాది ఎంతో ఉత్సాహమైన జట్టు’’ అని స్టాయినిస్‌ పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ, చెన్నై‌తో శుక్రవారం తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.