WTC Finals: నాకు ప్రపంచకప్‌ లాంటిది:నీల్‌ వాగ్నర్‌

తాజా వార్తలు

Published : 31/05/2021 01:07 IST

WTC Finals: నాకు ప్రపంచకప్‌ లాంటిది:నీల్‌ వాగ్నర్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉంటూ  కేవలం టెస్టు క్రికెట్ మాత్రమే ఆడుతున్న తనకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ ఫైనల్ ప్రపంచకప్‌ లాంటిదని న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ నీల్ వాగ్నర్‌ అన్నాడు. ఇక, సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.
  ‘నా కెరీర్‌లో అతిపెద్ద నిరాశ కలిగించే అంశం ఏదైనా ఉందంటే..  వన్డేలు, టీ20ల్లో నేను న్యూజిలాండ్‌ తరఫున  ప్రాతినిధ్యం వహించకపోవడం. కానీ, ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశం నాకు మళ్లీ రాకపోవచ్చు. ఇప్పుడు నా దృష్టి అంతా టెస్టు క్రికెట్‌ పైనే ఉంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ మొదటిదే కావొచ్చు. దీని చుట్టూ పెద్ద చరిత్ర లేకపోవచ్చు. కానీ, ఇది చాలా పెద్ద ఆరంభం. ప్రపంచంలోనే ఉత్తమ జట్లలో ఒకటైన భారత్‌తో ఈ ఫైనల్‌లో తలపడతున్నాం. ఒక వేళ ఇది నిజం కాకపోతే ఆ జట్టు ఇంత ఉన్నతస్థాయికి  ఎలా రాగల్గుతుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న నాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ ప్రపంచ కప్‌ లాంటిది’నీల్‌ వాగ్నర్‌ అన్నాడు.

ఇక, న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన తర్వాత అతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఈ సుదీర్ఘ పర్యటనకు ఆటగాళ్లలందరూ సిద్ధమమయ్యారు. వారంతా ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. జూన్‌ 3న కోహ్లీ సేన ఇంగ్లాండ్‌కు చేరుకోనుంది.

 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని