Virat Kohli: ధావన్‌పై కోహ్లీ ఫన్నీ వీడియో.. భలే సరదాగా ఉంది!

తాజా వార్తలు

Published : 19/10/2021 02:08 IST

Virat Kohli: ధావన్‌పై కోహ్లీ ఫన్నీ వీడియో.. భలే సరదాగా ఉంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ను ఆటపట్టించాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్టుచేశాడు. ధావన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ వీడియో తీసిన కోహ్లీ దాన్ని అభిమానులతో పంచుకొని నవ్వులు పూయించాడు. ప్రస్తుతం జట్టులో ధావన్‌ తన స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందో చూపిస్తూ సరదాగా నవ్వులు పూయించేందుకు ఇలా చేసినట్లు కోహ్లీ చెప్పాడు.

గబ్బర్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను తాను పలుమార్లు గమనించానని, అది సరదాగా ఉంటుందనే ఈ వీడియో చేసినట్లు కోహ్లీ వివరించాడు. ఇక ఆ వీడియో చూసిన అభిమానులు సరదాగా ఉందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ధావన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు తన భుజాల దగ్గర జెర్సీని ఎలా సర్దుకుంటాడో కోహ్లీ అచ్చం అలాగే చేసి అభిమానులను అలరించాడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2021లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ధావన్‌ 16 మ్యాచ్‌ల్లో 587 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో అతడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం గమనార్హం. కోహ్లీ చేసిన సరదా వీడియో మీరూ చూసి ఆస్వాదించండి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని