Delhi Capitals: దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల సందడి.. ఆడి పాడి చిందులు

తాజా వార్తలు

Published : 11/09/2021 16:29 IST

Delhi Capitals: దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్ల సందడి.. ఆడి పాడి చిందులు

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్దిరోజుల్లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ తిరిగి ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే అన్ని జట్లూ (దాదాపు) యూఏఈకి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ ప్రాక్టీస్‌ చేస్తూ పకడ్బందీగా సన్నద్ధమవుతున్నాయి. అయితే, తొలి అర్ధభాగంలో అదిరిపోయే ప్రదర్శనతో టాప్‌లో నిలిచి ఆకట్టుకున్న దిల్లీ క్యాపిటల్స్‌ శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్‌ పూర్తయ్యాక ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడ ఆటగాళ్లు ఆటలు, పాటలతో సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పంచుకొని మరిచిపోలేని రాత్రి అంటూ ఆ జట్టు సంతోషం వ్యక్తంచేసింది.

ఈ వీడియోలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా సందడి చేశాడు. మార్చిలో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సందర్భంగా భుజానికి గాయమైన అతడు ఏప్రిల్‌ 9న ప్రారంభమైన ఐపీఎల్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు కోలుకోవడంతో తిరిగి జట్టుతో కలిసి యూఏఈకి చేరుకున్నాడు. అందరిలాగే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ తర్వాతి సీజన్‌లో మెరవాలని చూస్తున్నాడు. కాగా, దిల్లీ పంచుకున్న వీడియోలో శ్రేయస్‌ కొత్త ఉత్సాహంతో సందడి చేశాడు. తమిళ స్టార్‌హీరో విజయ్‌ నటించిన వాతి కమింగ్‌ పాటకు స్టెప్పులేస్తూ జట్టులో హుషారెత్తించాడు. ఇంకా వివిధ ఆటలు, పాటలతో ఆటగాళ్లంతా మైమరచిపోయారు. మీరూ ఆ వీడియోను చూసి ఆనందించండి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని