Cricket News: బౌండరీ లైన్‌ వద్ద మునివేళ్లపై అద్భుత క్యాచ్‌..!

తాజా వార్తలు

Published : 17/10/2021 13:33 IST

Cricket News: బౌండరీ లైన్‌ వద్ద మునివేళ్లపై అద్భుత క్యాచ్‌..!

(Photo: Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో ఈ మధ్య అద్భుత క్యాచ్‌లు నమోదవుతున్నాయి. పరుషులు, మహిళలు అనే తేడా లేకుండా మైదానంలో ఫీల్డర్లు మెరుపు విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. ఇవన్నీ ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారినా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. దీంతో క్రికెట్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారతున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ అలాంటి ఓ అద్భుత క్యాచే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఆ ఫీల్డర్‌ బౌండరీ లైన్‌పై గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకుంది. అయితే బాలెన్స్‌ కోల్పోయింది. దీంతో బౌండరీ లైన్‌కు ఆనుకునేలా మునివేళ్లపై నిల్చొని బంతిని మళ్లీ గాల్లోకి విసిరింది. ఆపై ఆమె బౌండరీ దాటి తిరిగి మైదానంలోకి చేరి బంతిని ఒడిసిపట్టింది. తొలుత బంతి అందుకున్నప్పుడు ఆమె రెండు పాదాలు నేలకు ఆనించిన సమయంలో బౌండరీ లైన్‌కి టచ్‌  కాకుండా అతికష్టం మీద తన శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకొని వావ్‌ అనిపించే క్యాచ్‌ అందుకుంది. ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పంచుకోగా అందరూ ఆమెను అభినందిస్తున్నారు.

బిగ్‌బాష్‌ లీగ్‌లో శనివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ పోటీపడిన సందర్భంగా ఈ క్యాచ్‌ నమోదైంది. సిడ్నీ ఛేదనలో 19వ ఓవర్‌లో ఇసాబెల్లె వాంగ్‌ (6) బ్యాటింగ్‌ చేస్తుండగా నాలుగో బంతిని డీప్‌మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదాలని చూసింది. దీంతో బంతి అమాంతం బౌండరీ లైన్‌ దాటిపోయేలా కనిపించింది. సరిగ్గా అప్పుడే అడిలైడ్‌ ఫీల్డర్‌ బ్రిడ్జెట్‌ పాటర్సన్‌ గాల్లోకి ఎగిరి తనని తాను బ్యాలెన్స్‌ చేసుకొని నమ్మశక్యం కాని క్యాచ్‌ అందుకుంది. కాగా, చివరికి ఈ మ్యాచ్‌లో అడిలైడ్‌ జట్టే 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని